అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ విలీన గ్రామాలు: కోట గోపి

SRPT: మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కోట గోపి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని కోమటికుంటలో ప్రజా సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పాల్గొని మాట్లాడారు. విలీన గ్రామాల అభివృద్ధిపై మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.