'ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించుకోవాలి'

'ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించుకోవాలి'

ASR: అనంతగిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల-1, 2లో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల చదువు, ప్రవర్తన, పాఠశాల అభివృద్ధి గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతీ విద్యార్థి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు.