VIDEO: రాజమండ్రిలో సందడి చేసిన 'సుందరకాండ' మూవీ టీమ్

E.G: ఈనెల 27న విడుదలవుతున్న 'సుందరకాండ' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. 'సుందరకాండ' మూవీ టీం ప్రమోషన్‌లో భాగంగా శనివారం రాజమండ్రి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ చిత్రానికి వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారని, హీరోయిన్లుగా శ్రీదేవి, వ్రితి వాఘని నటించారని చెప్పారు.