'రోడ్డు భద్రతపై యువత అవగాహన కలిగి ఉండాలి'

'రోడ్డు భద్రతపై యువత అవగాహన కలిగి ఉండాలి'

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ వేడుకల అవగాహన సదస్సును డీసీపీ దార కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.