ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి మృతి

NLG: దండంపల్లి SLBC కెనాల్ వద్ద ఈతకు వెళ్లిన విద్యార్థి మృతి చెందాడు. ఎన్జీ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈరోజు ఈతకు వెళ్లగా, వారిలో ఉదయ్ కుమార్ గల్లంతయ్యాడు. సహచర విద్యార్థులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై సైదా బాబు సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు.