VIDEO: నల్లపాడు పోలీసుల తీరుపై అంబటి ఫైర్
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు. కూటమి నాయకులు, పోలీసులు కుమ్మక్కై ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, సోమవారం గుంటూరు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా నల్లపాడు పోలీసుల తీరుపై విచారణ జరపాలని, దాడిపై సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై త్వరలోనే డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.