ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు

కృష్ణా: కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్‌లో నియామకం పొందారు.