VIDEO: రైతు ఆత్మహత్యాయత్నం.. కుటుంబ కలహాలే కారణం

MHBD: కొత్తగూడ మండలం బుర్కగుంపు గ్రామానికి చెందిన రైతు మల్లెల నరసయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట యూరియా కొరత కారణంగా ఈ ఘటన జరిగినట్లు ప్రచారం వ్యాపించింది. కాగా ఆదివారం నరసయ్య కూతురు మాట్లాడుతూ.. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.