IPL ఫ్యాన్స్‌తో మెట్రో ఫుల్.!
HYD: ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగనుండగా మ్యాచ్ చూడటం కోసం వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మెట్రోలో తరలివస్తున్నారు. దీంతో IPL మ్యాచ్ సందడి స్టేడియం మెట్రో స్టేషన్‌లో కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా మ్యాచ్ తిలకించేందుకు తరలిరావడంతో పండగ వాతావరణం ఏర్పడింది. మెట్రోలో IPL జోష్ స్పష్టంగా కనిపిస్తోంది.