కొవ్వురాయిలో హాట్‌బజార్ ప్రారంభం

కొవ్వురాయిలో హాట్‌బజార్ ప్రారంభం

ASR: హుకుంపేట మండలం కొవ్వురాయిలో హాట్ బజార్‌ను అరకు నియోజకవర్గ TDP ఇంచార్జ్ సియ్యారి దొన్నుదొర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. హాట్‌బజార్ ఏర్పాటు ద్వారా గిరిజన రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా విక్రయించేందుకు ఉపయోగపడుతుందన్నారు.