'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

GNTR: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి స్పష్టం చేశారు. మంగళవారం కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో నూతన కమిటీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.