ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: MD
HYD: జలమండలి పరిధి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎండి అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా కలుషిత నీరు, సీవరేజి ఓవర్ ఫ్లో, మిస్సింగ్ మ్యాన్ హోళ్లపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆఫ్ లైన్ ఫిర్యాదులను సైతం ఎంసీసీ పరిధిలో నమోదు చేసి పరిష్కరించాలన్నారు.