ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
BHNG: మోత్కూర్ - తిరుమలగిరి ప్రధాన రహదారి అయినటువంటి కంచనపల్లి నూనె మిల్లు దగ్గర ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగత్రులలో ఒకరు తొండ గ్రామానికి చెందిన వేల్పుల నరసయ్య (వంట మాస్టర్)గా గుర్తించారు. స్థానికులు వెంటనే 108కి కాల్ చేసి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.