నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?

నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?

నదుల్లో రాగి నాణేలు వేయడం వెనుక లోతైన అర్థం ఉంది. శాస్త్రీయంగా రాగికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. పూర్వం నదులే ప్రధాన నీటి వనరులు కాబట్టి ఈ ఆచారం మొదలైంది. ఆధ్యాత్మికంగా ఇది సూర్య, కుజ దోషాలను తొలగించి, మనశ్శాంతిని, ఆర్థికాభివృద్ధిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆది, మంగళవారాల్లో ఇలా చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాచీన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.