ఎంపీ నిధుల నుంచి అభివృద్ధికి కృషి చేస్తా: డీకే అరుణ
RR: ఎన్నికలు ఏవైనా ఫలితం సాధించాలని MP డీకే అరుణ అన్నారు. SDNR నియోజకవర్గం పర్వతాపూర్ సర్పంచ్ అశోక్, కడియాల కుంట సర్పంచ్ రాజు నాయక్ BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో MPని కలిశారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేలా కృషి చేయాలని, ఎంపీ నిధుల నుంచి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.