కార్మికులకు జీతాలను చెల్లించాలని వినతి
KDP: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 65 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఈ మేరకు బుధవారం యూనియన్ నాయకులు సత్యనారాయణ, విజయకుమార్, రాఘవ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిశారు. వెంటనే కార్మికులకు జీతాలను చెల్లించాలని కోరారు. నిబంధనల మేరకు ప్రతి కార్మికునికి నెలకు రూ. 16,400లు చెల్లించాల్సి ఉందన్నారు.