రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

కృష్ణా: చాగల్లు-రాజమండ్రి సెక్షన్ల మధ్య ట్రాఫిక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ- కాకినాడ పోర్ట్ మెము ఎక్స్ప్రెస్ రైళ్లను యధావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం. 17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ రైళ్లును రద్దు చేసినట్లు చెప్పారు.