నేడు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

SRPT: మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంలో నేడు బుధవారం రాత్రి 7 గంటలకు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరవుతారని, ఈ కార్యక్రమానికి గ్రామంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో మునగాల ఎస్సై ప్రవీణ్ కోరారు.