కొల్లూరులో కార్డన్ సెర్చ్ నిర్వహణ

కొల్లూరులో కార్డన్ సెర్చ్ నిర్వహణ

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, ఆదివారం కొల్లూరులో పోలీసులు 'కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 130 మంది సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.