ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ

NLG: చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలునాయక్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఏఎస్పీ మౌనిక హాజరై క్యాంపును ప్రారంభించారు. ప్రముఖ వైద్యుల చేత రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.