బోరెడ్డిగారిపల్లిలో మంత్రి రాంప్రసాద్ ప్రజాదర్బార్
అన్నమయ్య: చిన్నమండెం మండలంలోని బోరెడ్డిగారిపల్లి గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించిన మంత్రి, భూ సమస్యలు, మోసాలు, కుటుంబ సమస్యలు వంటి పలు సమస్యలపై సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.