'నిర్వాసితులకు న్యాయ సేవలు అందిస్తాం'
SKLM: మెలియాపుట్టి మండలంలోని చీపురుపల్లి గ్రామ నిర్వాసితులకు న్యాయ సేవలు అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీకాకుళం లీగల్ టీం వడ్డేపల్లి జ్యోతిర్మయి, గొంటి చంద్రమోహన్ అన్నారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్,జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు కొరికానా భవాని ఆదేశాలమేరకు శనివారం గ్రామాన్ని సందర్శించి నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు.