సీతంపేట ఐటీడీఏలో మాక్ పార్లమెంట్
PPM: సీతంపేట మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యలయంలో బిర్సా ముండా 150వ ఉత్సవాలు సందర్భంగా విద్యార్థులు మంగళవారం మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందన్నారు. రానున్న రోజుల్లో మీరంతా ప్రయోజకులై దేశానికి మంచి సేవలందించాలన్నారు. ఇందులో ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.