తెలుగు భాష రక్షణకు "టిట్టిభ సత్యాగ్రహం"

తెలుగు భాష రక్షణకు "టిట్టిభ సత్యాగ్రహం"

VSP: తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "టిట్టిభ సత్యాగ్రహం" రెండో రోజు కూడా నిర్విఘ్నంగా జరిగింది. విశాఖ GVMC గాంధీ బొమ్మ వద్ద రిలే నిరసన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు, భాషాభిమానులు పాల్గొని దివంగత సహజ కవి "అందెశ్రీ"కు ఘనంగా నివాళులర్పించారు.