VIDEO: కురవి వీరభద్ర స్వామికి ఉదయపు హారతి
MHBD: కురవి మండలంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నేడు కార్తీకమాసం శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, భక్తుల సమక్షంలో ఉదయపు హారతి ఇచ్చారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలిరాగా, ఆలయంలో సందడి నెలకొంది.