మల్లన్న స్వామికి ఊయల సేవ కార్యక్రమం

మల్లన్న స్వామికి ఊయల సేవ కార్యక్రమం

NDL: లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మూలా నక్షత్రం సందర్భంగా శ్రీశైల మల్లన్న దంపతులకు ఆదివారం రాత్రి ఊయల సేవను జరిపించారు. ఊయల సేవను పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పలంకరణ పుష్పార్చన జరిపించారు. పుష్పాలంకరణకుగాను ప్రత్యేక పుష్పాలు వినియోగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో శ్రీనివాసరావు దంపతులు అధికారులు అర్చకులు స్వాములు పాల్గొన్నారు.