కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహుల ఆందోళన

కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహుల ఆందోళన

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లోనే కో-ఆప్షన్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయకపోవడంతో గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి.