బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

కడప: కడప-బద్వేల్ ప్రధాన రహదారి సిద్ధవటంలో ఆదివారం సాయంత్రం బస్సు ఢీకొని ఒ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు సంటిగారి పల్లె గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా సిద్ధవటంలోని మలుపు వద్ద బద్వేలు డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో బలమైన గాయాలు అయ్యాయి.108 వాహనంలో కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.