ఫ్రీ బస్సు.. రికార్డు సృష్టించిన మహిళలు

కోనసీమ: స్త్రీ శక్తి పథకానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో 60,671 మంది మహిళలు బస్సులో ప్రయాణించి రికార్డు సృష్టించినట్లు రామచంద్రపురం డిపో మేనేజర్ పి.భాస్కరరావు వెల్లడించారు. రామచంద్రపురం డిపో పరిధిలో అత్యధికంగా 19,330మంది, రావులపాలెం పరిధిలో 18,171మంది, అమలాపురం 14,876మంది, రాజోలు 9,481మంది బస్సు సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు.