14న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఈనెల 14న ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న ఇవాళ తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సమావేశం నిర్వహించే విద్యార్థుల ప్రగతిని వారికి వివరించాలన్నారు.