జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం స్థానిక పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారి ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. నిరంతరం వారిపై నిఘా ఉంటుందని తెలిపారు.