తుగ్గలి మండలంలో ఈస్టర్ ప్రార్థనలు

KRNL: తుగ్గలి మండలంలో పలు చర్చిలలో ఆదివారం ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. తుగ్గలి రాతన చర్చిలో పాస్టర్లు సుధాకర్, సువర్ణరావు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రాణత్యాగం చేసిన క్రీస్తు మూడో రోజే సజీవుడై తిరిగొచ్చిన పవిత్ర దినం ఈస్టర్ అని, ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం తీసుకురావాలని ప్రార్థించారు.