కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
TG: ప్రధాని మోదీతో బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలోని అంశాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్‌లో జరిగిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని అన్నారని, అయినా ఆ విషయాలు బయటకు వచ్చాయని అసహనం వ్యక్తంచేశారు. ఆ అంశాలు బయటకు చెప్పినవారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.