నేడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
WNP: గోపాలపేట మండలంలో ఆదివారం కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఏదుల, రేవల్లి, గోపాల్ పేట మండలాలకు చెందిన రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చన్నారు. రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.