పన్నులు కడితేనే వేగంగా అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
NZB: ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 చెత్త సేకరించే ఆటోలను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి చెత్త సేకరించే ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లాలని సూచించారు.