పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు

ASR: 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి బుధవారం తెలిపారు. ఈనెల 26 వరకూ ఓఏఎండీసీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 24 నుంచి 28 వరకూ వెబ్ ఆప్షన్ ఉంటుందన్నారు. ఈనెల 31వ తేదీన సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.