పోలియోపై ప్రతి ఒక్కరూ పోరాడాలి: సీపీ

పోలియోపై ప్రతి ఒక్కరూ పోరాడాలి: సీపీ

VSP: పోలియో రహిత ప్రపంచం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. ఆదివారం రోటరీ క్లబ్స్ నిర్వహించిన పోలియో నిర్మూలన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్‌తో మశూచిని నిర్మూలించినట్లే, పోలియోను కూడా అంతం చేయవచ్చని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నర్ డా. కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.