ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
KDP: పోరుమామిళ్ల మండలానికి చెందిన విద్యార్థి ఇవాళ విడుదల అయిన ఇంటర్ పలితాల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ప్రమాదకరమైన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కి రిఫర్ చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.