'కొందరు పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు'

'కొందరు పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు'

GNTR: పోలీస్ యంత్రాంగంలో ముఖ్యమైన వ్యక్తులు తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. కొమ్మినేని శ్రీనివాస్‌పై ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారని వీరుచుకుపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి సభలకు జనాన్ని సమీకరిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ పోలీసులు బెదిరించడం రూల్స్‌కి వ్యతిరేకమన్నారు.