మాక్ అసెంబ్లీకి వంశీక ఎంపిక
ELR: ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన వంశిక ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వంశీక ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా బుధవారం చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్‌ను కలిశారు. మాక్ ఎమ్మెల్యేగా తన ప్రతిభతో నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.