ఎమ్మెల్యే వేముల సుడిగాలి ప్రచారం
NLG: చిట్యాల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం సుడిగాలి ప్రచారం చేపట్టారు. పేరేపల్లి అభ్యర్థి వనిత, బొంగోనిచెర్వు అభ్యర్థి కట్ట ఆశయ్య, వెలిమినేడు అభ్యర్థి అంతటి నర్సింహ, వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి, ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి ప్రసంగించారు.