వాంబే కాలనీలో తప్పిపోయిన వృద్ధుడు

వాంబే కాలనీలో తప్పిపోయిన వృద్ధుడు

కృష్ణా: విజయవాడలోని వాంబే కాలనీలో శివాజీ అనే వృద్ధుడు దారి తప్పి తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు. తన ఇంటిని మర్చిపోయానని ఆయన చెప్పడంతో, స్థానికులు వెంటనే నున్న పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరికైనా తెలిస్తే పోలీస్ స్టేషను సంప్రదించాలని కోరారు.