ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగల చోరి

ADB: లోకేశ్వరం మండలం పంచగుడి ఎత్తిపోతల పథకానికి చెందిన విద్యుత్ సబ్ స్టేషన్ లోని రెండు ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగలను చోరీ చేశారు. చోరీకి గురైన రాగి తీగలు ఇతర వస్తువుల విలువ దాదాపు రూ.14 లక్షల వరకు ఉంటుందని సభ్యులు తెలిపారు. దీంతో ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.