అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
ATP: బుక్కరాయసముద్రంలో త్వరలో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే బండారు శ్రావణి సందర్శించారు. గత ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే ఈ పథకాన్ని రద్దు చేసిందని, కూటమి ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలోనే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చి పేదల ఆకలి కష్టాలను తీరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.