రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అప్పన్నపేట విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన  అప్పన్నపేట విద్యార్థులు

PDPL: అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అండర్ 17 విభాగంలో ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో 9వ తరగతి విద్యార్థులు అలీషా, అర్చన, 8వ తరగతి విద్యార్థి సృజన్ ఉన్నారు. వీరిని హెడ్‌మాస్టర్ పురుషోత్తం, ఉపాధ్యాయులు శ్రీదేవి కనకయ్య, ఎల్. శ్రీనివాస్ రాజేశ్వర రావు అభినందించారు.