ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ ప్రారంభం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సీఎం జగన్ పర్యటించారు. లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సీఎం జగన్ పర్యటించారు. లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ రిజిస్ట్రేషన్లో తొలి నమోదు చేసి సీఎం జగన్ సంతకం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం వల్ల సుమారు 69.64 లక్షల మంది పేదలకు వైద్యం అందనుందని సీఎం తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ లో భాగంగా 104 వాహనంలో అత్యాధునిక పరికరాలను పరిశీలించారు.