చిత్తూరులో ముమ్మరంగా రోడ్డు విస్తరణ పనులు
చిత్తూరులో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణాల పనులు వేగంగా, నాణ్యతగా చేపట్టాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే పలమనేరు రోడ్డులో దర్గా సర్కిల్ వద్ద, కన్నన్ జూనియర్ కళాశాల వద్ద జరుగుతున్న ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు.