PGRSలో 435 అర్జీలు స్వీకరణ: జేసీ
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 435 అర్జీలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, సంబంధిత అధికారులతో విచారించి త్వరగా పరిష్కరిస్తామని జేసీ పేర్కొన్నారు.