గణేశ్ నిమజ్జన ర్యాలీకి ఏర్పాట్లు ముమ్మరం

HYD: గణేశ్ నిమజ్జన ర్యాలీకి సంబంధించి కార్వాన్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నామని, రోడ్ల పక్కన చెత్తను క్లియర్ చేస్తున్నామన్నారు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.