దాడులను అరికట్టాలంటూ ర్యాలీ
ELR: సామాజిక న్యాయం ఆత్మగౌరవం కాపాడాలని సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా చింతలపూడిలో కారుమూడి సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.